ప్రజాశక్తి - ఆలమూరు : 216 ఏ జాతీయ రహదారిపై మండలంలోని మూలస్థానం వద్ద సుమారు రూ. 1.50 లక్షల గ్రామస్తుల విరాళాలతో నిర్మించిన శ్రీ ఉమామూలేశ్వర స్వామి బస్ షెల్టర్ ను గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా వారిరువురికి ఘన స్వాగతం పలికారు. ఆలాగే బస్సు షెల్టర్ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు, నిర్మాణ సమయంలో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ సహకారం అందించిన కొండేటి శ్రీనివాస్, బావిశెట్టి తాతాజీ, చీకట్ల నాగబాబు, జోల్లా దుర్గా ప్రసాద్, తోట నాగన్న తదితరుల నిర్విరామ కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ బస్సు షెల్టర్ ప్రయాణికులందరికీ మరీ ముఖ్యంగా మహిళలు, విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే బండారు అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు సలాది జయప్రకాష్ నారాయణ, సూరపురెడ్డి సత్య, సలాది నాగేశ్వరరావు, వంటిపల్లి సతీష్ కుమార్, ఈదల నల్లబాబు, నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి వెంకటరత్నం, గ్రామ ప్రత్యేక అధికారి, ఎంఏవో బి.మీనా, కార్యదర్శి దేవి ప్రియ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూలస్థానం నూతన బస్ షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 09, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)