మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘మురసు’ ప్రభావంతో పలు రైళ్లు రద్దు

1 గంట క్రితం

Impact of Cyclone Arnab... 53 trains cancelled!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 09:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మరికొన్ని దారి మళ్లింపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మురసు తుపాను ప్రభావం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని పునరుద్ధరించింది. కొన్ని రైళ్ల సమయాలను మార్చగా, మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడ డివిజన్ ప్రజా సంబంధాల అధికారి నుస్రత్ ఎం.మందృప్కర్ మంగళవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. తుపాను ముందస్తు చర్యల్లో భాగంగా నవంబరు 3, 4 తేదీల్లో నడవాల్సిన 16 రైళ్లను రద్దు చేశారు. వీటిలో సికింద్రాబాద్–తిరువనంతపురం సెంట్రల్ (20629), సికింద్రాబాద్–గూడూరు (12710), నరసాపురం–లింగంపల్లి (17255), విజయవాడ–గూడూరు (67225), విజయవాడ–బిట్రగుంట (67259), విజయవాడ–గూడూరు (12744), నరసాపురం–గుంటూరు (17282) తదితర రైళ్లు ఉన్నాయి. సంబంధిత తిరుగు ప్రయాణ రైళ్లనూ రద్దు చేశారు.

నాలుగు రైళ్లు పునరుద్ధరణ

గతంలో మార్గ మార్పులు లేదా ఇతర కారణాలతో ప్రభావితమైన నాలుగు రైళ్లను తిరిగి వాటి అసలు మార్గంలో నడపాలని నిర్ణయించారు. వీటిలో గువహటి–ఎస్‌ఎమ్‌విటి బెంగళూరు (12510), చెన్నై సెంట్రల్–లక్నో (16093), బిలాస్‌పూర్–ఎర్నాకుళం (22815), ఎర్నాకుళం–పాట్నా (22643) రైళ్లు ఉన్నాయి.

పది రైళ్లు సమయాల్లో మార్పులు

తిరుపతి–చర్లపల్లి (17441) రైలును 8 గంటలు, తిరుపతి–లింగంపల్లి (12733) రైలును రెండు గంటలు ఆలస్యంగా నడపనున్నారు. చెన్నై సెంట్రల్–విశాఖపట్నం (22870) రైలు నవంబర్ 4వ తేదీ తెల్లవారుజామున ఒంటి గంటకు బయలుదేరనుంది. యశ్వంత్‌పూర్–ఇండోర్ (19302) రైలు నవంబర్ 3న రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. ఇతర రైళ్లకు కూడా నిర్ణీత సమయాల్లో మార్పులు చేశారు.

మూడు రైళ్లు దారి మళ్లింపు

హజ్రత్ నిజాముద్దీన్–చెన్నై సెంట్రల్ (12612), భగత్ కి కోఠి–చెన్నై సెంట్రల్ (20626), జోగ్బని–ఈరోడ్ జంక్షన్ (16602) రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. ఈ మార్గమార్పుల కారణంగా విజయవాడ, ఒంగోలు, గూడూరు సహా కొన్ని స్టేషన్లలో ఆయా రైళ్లకు హాల్టులు ఉండవు. ప్రయాణికులు బయలుదేరే ముందు ఎన్‌టిఇఎస్ యాప్‌లో రైళ్ల తాజా నడక స్థితిని పరిశీలించి ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్