సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం

15 గంటల క్రితం

tamim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 09:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : షైనింగ్ స్టార్స్-2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం అన్ని జిల్లాల్లో జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్ధులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మండలం నుంచి ఓసి కేటగిరిలో ఇద్దరు, బిసి కేటగిరీలో ఇద్దరు, ఎస్సి,ఎస్టి కేటగిరిలలో చేరొకరి చొప్పున ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. వీరితో పాటు ప్రత్యేక అవసరాల కేటగిరిలో ప్రతి జిల్లా నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి కేటగిరిలలో కనీసం 600 మార్కులకు 500 మార్కులు(83.33శాతం) సాధించిన విద్యార్ధులను, ప్రత్యేక అవసరాల కేటగిరిలో 70శాతానికి పైబడి మార్కులు సాధించిన విద్యార్ధులను ఎంపిక చేసినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4344 మంది విద్యార్ధులు ఈ అవార్డుకు ఎంపికయ్యారని వీరిలో 2,960(68.14శాతం) మంది బాలికలు, 1384(31.86శాతం) మంది బాలురు ఉన్నారని తెలిపారు. ఎంపికైన విద్యార్ధులకు పతకం, రూ.20వేల నగదుతో పాటు ప్రశాంస పత్రం అందించనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జిల్లా ఇన్‌ ‌మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం జరుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్