రెగ్యులర్ చేసేవరకు పోరాటం : సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు
ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : విజయనగరం లో పూరి గుడిసెలు, రేకులు ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న పేదలుకి వారినివాసం ఉన్న చోటే పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో పేదలు తహసీల్దార్ ఆఫిస్ ముట్టడించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి రెడ్డిశoకరరావు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా సిపిఎం పోరాటం చేసిన ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జిఓ నెంబర్ 30 ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కానీ దానిని అమలు చేయడoలేదన్నారు. ఈ జి ఓ ప్రకారమే విశాఖ, మంగళగిరి, విజయవాడ తదితరచోట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకి పట్టాల పండగ అని పట్టాలి స్తున్నారన్నారు. కానీ రామకృష్ణ నగర్, ఎల్ బి జి నగర్, గురజాడ నగర్, వినాయక నగర్, తదితర కాలనీల్లో పేదలు ఇప్పటికే తమ నివాసo ఉన్నచోట పట్టాలివ్వాలని వార్డు సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకున్నారన్నారు. దరఖాస్తు చేసుకుని ఆరు నెలలైనా నేటికి పట్టాలు ఇవ్వలేదన్నారు. తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన పెద్దలు అడ్డ దారుల్లో జిఓ నెంబర్ 30 ని అడ్డు పెట్టుకుని చట్టభద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్నారు. కానీ పేదలు నివాసం ఉన్న కాలనీల్లో మాత్రం సెంటు భూమి ఇవ్వడానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని, అంటే పేదల కోసం తెచ్చిన జిఓ పెద్దలుకి ఉపయోగపడుతుందన్నది తప్ప పేదలకి కాదు అన్నది స్పష్టమవుతుందన్నారు. పట్టాలిస్తామని పేపర్లో ప్రకటనలే తప్ప ఆచరణ లో పట్టాలివ్వడం లేదని, కేవలం కపట ప్రేమ చూపెడుతుంది తప్పా నివాసనo ఉన్న చోట పట్టాలివ్వడం లేదని అన్నారు. విశాఖ పట్టణములో నిన్న ముఖ్య మంత్రి, మంగళ గిరిలో లోకేష్ పట్టాలిచ్చారని, మరి విజయనగరంలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. జిఓ నెంబర్ 30 రాష్ట్ర మంతటా వర్తిస్తుందని అన్నారు. విజయనగరం లో ఎల్ బి జి నగర్, రామకృష్ణ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్, తదితరకాలనీల్లో ప్రజలు సంవత్సరాలు తరబడి నివాసం ఉంటున్నారు. అయినా పేదలు కి మాత్రం
పట్టాలివ్వడానికి పాలకుల కి చేతులు రావడం లేదన్నారు. తక్షణమే పట్టాలివ్వాలనిడిమాండ్ చేశారు, లేదంటే న్యాయం జరిగే వరకు పోరాడతామని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ వచ్చి వినతి పత్రం తీసుకుని ప్రభుత్వం నార్మ్స్ ప్రకారం ధర్యాప్తు జరిపించి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ , నగర కమిటీ సభ్యులు బి. రమణ,ఎం. సాంతమూర్తి, వి. లక్ష్మి,రంభ శ్రీను, రామలక్ష్మి, జి. పుణ్యవతి జగద్దాంబ అధిక సంఖ్యలో పేదలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)