mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్వరం, కామెర్లతో అన్నాచెల్లెలు మృతి

2 గంటల క్రితం

deaths
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పెదబయలు (అల్లూరి జిల్లా): అల్లూరి జిల్లా పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ పరిధి బట్టగుంది గ్రామంలో జ్వరం, కామెర్లతో బాధపడుతూ కొద్డి గంటల వ్యవధిలోనే అన్నాచెల్లెలు మృతి చెందారు. దీంతో, గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అంగూరి కోటేశ్వరరావుకు కుమారుడు జీవన్‌ రాజ్‌ (10), కుమార్తె మేరీ (9) ఉన్నారు. వారు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్థానిక ఆర్‌ఎంపి వద్ద వైద్యం చేయించుకున్నారు. నాటు వైద్యమూ తీసుకున్నారు. పరిస్థితి విషమించి శనివారం రాత్రి పది గంటలకు మేరీ మృతిచెందగా, ఆదివారం ఉదయం జీవన్ రాజ్ చనిపోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు జ్వరంతో మృతిచెందడంతో మండల వైద్య బృందం ఆదివారం ఆ గ్రామానికి వెళ్లింది. ఇదే గ్రామానికి చెందిన మరో బాలుడు అంగూరి మోషే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆ బాలుడికి ప్రాథమిక వైద్యం అందించి, పాడేరు ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్టు మండల వైద్యాధికారి డాక్టర్‌ ‌నిఖిల్‌ ‌తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్