బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా : ఎమ్మెల్సీ రమాదేవి

1 గంట క్రితం

I will be constantly accessible to the people: MLC Ramadevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

చంద్రబాబుకు ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎమ్మెల్సీ రమాదేవి కృతజ్ఞతలు

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా...ఎమ్మెల్సీ రమాదేవి


ప్రజాశక్తి - అనంతపురం : వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సాధారణ బీసీ మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా రమాదేవిని ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, ఎమ్మెల్సీ రమాదేవి దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.


టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటరమణ కీలక పాత్ర ...

రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడం పట్ల ఆమె భర్త, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దళవాయి వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం, బీసీ సామాజికవర్గం కోసం వెంకటరమణ చేస్తున్న సేవలు, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్రను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేశారు. రమాదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధిష్టానం తన కుటుంబంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రమాదేవి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారని ఆయన తెలిపారు. రమాదేవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేస్తానని చెప్పారు. పార్టీ కోసం తన భర్త దళవాయి వెంకటరమణ అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం తనకు ఎంతో బలాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి పదవులు లభిస్తాయనడానికి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి దక్కడం నిదర్శనమన్నారు. ఒక సాధారణ బీసీ మహిళకు ఎమ్మెల్సీ పదవి రావడం చిన్న విషయం కాదని, ఇది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జిగా పనిచేసిన వడ్డెర మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరితో సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రమాదేవికి సూచించారు. అనంతపురం జిల్లాకు చెందిన బీసీ మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు. రమాదేవికి అభినందనలు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్