- ఎన్నికల ప్రచారంలో సిపిఎం నాయకులు
ప్రజాశక్తి మంగళగిరి (గుంటూరు జిల్లా )
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే గొంతుకగా నిలిచే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరి 34వ డివిజన్లో అభ్యర్థి పిల్లల మర్రి బాలకృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించి విలేకర్లతో మాట్లాడారు. మంగళగిరి పట్టణం, రూరల్ గ్రామాల్లోనూ, తాడేపల్లి లోను సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా పోరాటాలు చేస్తోందని తెలిపారు. అలాంటి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రశ్నించే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
రాజమహేంద్రవరం ధవళేశ్వరం పరిధిలోని 16వ డివిజన్‌లో సిపిఎం బలపరిచిన అభ్యర్థి పడాల నరేంద్రకుమార్, 22వ డివిజన్‌లో దుబాసి శ్రీనుకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేపట్టారు. కాకినాడలో 50వ వార్డు అభ్యర్థి ధనాల ధనలక్ష్మి తరుఫున ప్రచారం నిర్వహించారు. సిపిఎం బలపర్చిన అభ్యర్థిని గెలిపించాలని, మేయర్ అభ్యర్థిని ఓడించాలంటూ వారు ప్రచారం నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. సిపిఎం బలపరిచిన అభ్యర్థి మువ్వల మరియను గెలిపించాలని నాయకులు కోరారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 13వ వార్డు అభ్యర్థి కర్రి నాగేశ్వరరావు ఆయా వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. 14వ వార్డు అభ్యర్థి కరెడ్ల రామతులసి విస్తృతంగా పర్యటించారు. తణుకు మున్పిపాలిటీ 38వ వార్డు అభ్యర్థి అడ్డగర్ల అజయకుమారి ప్రచారం నిర్వహించారు. .
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ 20వ వార్డు అభ్యర్థి ఆర్విఎస్ నారాయణ ప్రచారం నిర్వహించిన తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
శ్రీకాళహస్తి 9వ వార్డు అభ్యర్థి భారతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కృష్ణాజిల్లా తాడిగడప మున్సిపాలిటీలోని 7వ వార్డు అభ్యర్థి తరిగొప్పుల లావణ్య, 20వ వార్డు అభ్యర్థి ఎస్.కె. మస్తాన్‌వలి, 26వ వార్డు అభ్యర్థి షేక్ జాన్వి ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. గుడివాడ 17వ వార్డు అభ్యర్థి బొంతు ధనలక్ష్మి, 33వ వార్డు అభ్యర్థి చంద్రగిరి లక్ష్మీ తిరుపతమ్మ, 46వ వార్డు అభ్యర్థి ఆర్.సి.పి. రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.









కామెంట్‌లు (0)