గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు

4 రోజుల క్రితం

రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆరిలోవ, మధురవాడ (విశాఖపట్నం) : సరదాగా స్నేహితులతో సముద్ర స్నానానికి వెళ్లిన విద్యార్థి గల్లంతైన ఘటన విశాఖలోని రుషికొండ బీచ్‌‌ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన కథనం మేరకు.. బుల్లయ్య కాలేజీకి చెందిన విద్యార్థులు ఎనిమిది మంది సరదాగా బీచ్‌కు వెళ్లారు. స్నానాలు చేస్తూ ఫొటోలు దిగుతుండగా అలల ఉద్ధృతికి వారిలో విశాఖ కోటవీధికి చెందిన యువకుగు జయ్యద్‌ ‌జాహిద్‌ ‌రాజా కొట్టుకుపోయి గల్లంతయ్యారు. తోటి స్నేహితులు లైఫ్‌ ‌గార్డులకు, పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీకి సమాచారం అందించడంతో వారూ రంగంలో దిగారు. గాలింపు చర్యలు సాగిస్తున్నారు. ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్