ప్రజాశక్తి -దత్తిరాజేరు : స్థానిక మండలంలోని శికారుగంజి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు అథ్లెటిక్స్ విభాగంలో విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపల్ ఎం. ఈశ్వరరావు తెలిపారు. ఈ నెల 26న కలవరాయి వేదికగా నిర్వహించిన జిల్లా స్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల పీడీ రాజేష్ వివరాలు వెల్లడిస్తూ.. డిస్కస్ త్రో విభాగంలో ఎం. మేఘన, 400 మీటర్ల హర్డిల్స్‌లో ఎం. నీలా ప్రసాద్, 4×100 మీటర్ల రిలేలో ఎన్. రిషిత, ఎం. పవిత్ర, వై. వాసవి, పి. పల్లవి (బాలికలు), బాలుర రిలే విభాగంలో పి. షణ్ముఖ సాయి, ఎం. మణికంఠ, 4 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ విభాగంలో సి.హెచ్. భారతి జిల్లా స్థాయిలో సత్తా చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నవంబర్ 14, 15 తేదీల్లో ఏలూరు వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు మరింత కఠోర శిక్షణ పొంది రాష్ట్రస్థాయిలోనూ పతకాలు సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపల్ ఎం. ఈశ్వరరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి. చంద్రశేఖర్, తెలుగు అధ్యాపకులు టి. నారాయణ, కంప్యూటర్ కం లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన శికారుగంజి మోడల్ స్కూల్ విద్యార్థులు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)