శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టిడిపి కూటమి కపటత్వం రుజువైంది : సిపిఎం

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026, 01:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయవాడ : రిజర్వేషన్లు 50 శాతాన్ని మించడానికి వీలు లేదన్న ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిసిలకు 34% రిజర్వేషన్ ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో టిడిపి కూటమి కపటత్వం బట్టబయలైందని భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. రిజర్వేషన్లకు ఉన్న గరిష్ట పరిమితిని 50 శాతం కంటే పెంచాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ జరగాలన్న విషయం ముఖ్యమంత్రికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియనిది కాదని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రజలను ప్రత్యేకించి వెనకబడిన తరగతుల వారిని మభ్యపుచ్చడానికే ప్రభుత్వం ఈ తతంగమంతా నడిపిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనాన్ని గురించి ఆ బిల్లు తెచ్చినప్పటినుండి సిపిఎం రాష్ట్ర కమిటీ చెబుతూనే ఉందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయితే ఫైనాన్స్ కమిషన్ నిధుల విడుదలకు ఇబ్బందులు ఏర్పడతాయని, కాబట్టి ఇటువంటి సమస్యలు రాకుండా రాజ్యాంగబద్ధమైన రీతిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్