ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి చేపట్టిన ‘ఇంటింటికీ టిడిపి’ 79.39లక్షల ఇళ్లకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకునేందుకు టిడిపి ఈ కార్యక్రమాన్ని జులై 27వ తేదిన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం79.39 లక్షల ఇళ్లకు చేరుకుందని టిడిపి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 28వ రోజైన ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,51,872 ఇళ్లను పార్టీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారని తెలిపింది. ఇప్పటికే 75 లక్షల ఇళ్ల మైలురాయిని అధిగమించి, ప్రజల గడపగడపకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం మరింత వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది.ప్రతీ గడపకు వెళ్లి ప్రతీ కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరిస్తూ రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయా కుటుంబాలకు తెలియజేస్తున్నారని వివరించింది. అదే సమయంలో ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపింది.
79.39లక్షల ఇళ్లకు చేరుకున్న ఇంటింటికీ టిడిపి
23 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)