సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైసిపి పేరుతో టిడిపి వాళ్లే నామినేషన్లు

2 రోజుల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వైసిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైసిపి పేరుతో టిడిపి నాయకులే నామినేషన్లు వేయించారని వైసిపి రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ‌సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి విడదల రజిజిని నిర్బంధించారని, అన్ని ప్రాంతాల్లోనూ వైసిపి నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలకు గురిచేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలపై అన్నీ అబద్ధాలే చెప్పారని, తన పాలనను హైదరాబాద్‌ నుంచి నడుపుతున్నారని అన్నారు. స్క్రూటినీ పేరుతో అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని తెలిపారు. నామినేషన్‌ ‌పత్రాలు చించేసి.. వైసిపి వాళ్లే దాడులు చేస్తున్నారని అంటున్నారని, నామినేషన్లు వేసే వాళ్లు ఎందుకు దాడులు చేస్తారని ప్రశ్నించారు. టిడిపి అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్