ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డాక్టర్‌ మంగాదేవికి కన్నీటి వీడ్కోలు

13 గంటల క్రితం

డాక్టర్‌ మంగాదేవికి కన్నీటి వీడ్కోలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు : ప్రముఖ విద్యావేత్త, శ్రీ వెంకటేశ్వరా బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ ఎన్‌.మంగాదేవికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. చౌడవరంలోని చైతన చారిటబుల్‌ ‌ట్రస్ట్‌ ‌ప్రాంగణంలో అంతిమ యాత్ర సందర్భంగా పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్‌ మంగాదేవి భౌతిక కాయాన్ని కాటూరి మెడికల్ కాలేజీకి అందజేశారు. వైద్య విద్యార్థుల అధ్యయనానికి, వైద్య విజ్ఞాన అభివృద్ధికి ఉపయోగపడేలా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. తొలుత చేతన ప్రాంగణంలో మంగాదేవి భౌతిక కాయాన్ని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ రమేష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, బాలకుటీర్ పూర్వ విద్యార్థులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటీర్ కుటుంబ సభ్యులందరూ డాక్టర్‌ మంగాదేవి ఆశయాలను కొనసాగిస్తూ, ఆమె నెలకొల్పిన విద్యాసంస్థల అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తుకు, సమాజ సేవకు అంకితభావంతో కృషి చేస్తామని బాలకుటీర్ సిఎఒ దుర్గా రఘురామ్ ప్రతిజ్ఞ చేయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్