ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించాలి

13 గంటల క్రితం

సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించాలి
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

ప్రజాశక్తి-గుంటూరు : వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఆంగ్లం, ఇతర భారతీయ, విదేశీ భాషల విభాగం ఆధ్వర్యంలో ‘బియాండ్‌ బౌండరీస్‌: కనెక్టింగ్‌ నేరేటివ్స్, ఎపిస్టమాలజీస్‌ అండ్‌ వరల్డ్‌వ్యూస్‌’ అనే అంశంపై మూడ్రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో భాగంగా సమకాలీన ప్రపంచంలోని పర్యావరణ, సామాజిక, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విభిన్న జ్ఞాన సంప్రదాయాలు, సాహిత్య దృక్పథాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించాలని బంగ్లాదేశ్ బ్రాక్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ సబీహా హక్ పిలుపునిచ్చారు. జల వనరులతో మానవ సంబంధాలు, నీటి వినియోగంలో లింగపరమైన అసమానతలను ఆమె సాహిత్య కోణంలో విశ్లేషించారు. అలాగే, న్యూయార్క్ సిటీ కాలేజీ ప్రొఫెసర్ పాట్రిక్ కార్బెట్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా జ్ఞాన సముపార్జనలో వస్తున్న మార్పులను వివరిస్తూ, సాంకేతికతతో పాటు మానవ విలువలు, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గౌతమ్ కర్మాకర్ భారతీయ గ్రాఫిక్ కథనాల ద్వారా పర్యావరణ సంక్షోభాలపై ప్రజల్లో అవగాహన పెంచవచ్చని పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానంతో పాటు ఆదివాసీ, స్థానిక జ్ఞాన సంపదకు సముచిత గుర్తింపు ఇస్తూ, భిన్న సంస్కృతుల మధ్య సహజీవన భావనను పెంపొందించాలన్నారు. వివిధ దేశాల విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సు అంతర్జాతీయ విద్యా సంబంధాలకు, విస్తృత పరిశోధనలకు ఎంతగానో దోహదపడింది.కార్యక్రమంలో విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్