ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య...

02 అక్టోబర్, 2026

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 08:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సి బెళగల్(కర్నూలు జిల్లా) : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా సి బెళగల్‌ ‌మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... పొలకల్‌ ‌గ్రామానికి చెందిన కౌలురైతు చిత్రసేనుడు (48) తన సొంత పొలం ఐదు ఎకరాలకు తోడు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, ఉల్లి, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. పంటలు చేతికందకపోవడంతో సుమారు రూ. ఐదు లక్షల మేర అప్పులపాలయ్యారు. దీనికి తోడు ఇటీవల కుమార్తె వివాహానికి చేసిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. అప్పులు తీరే మార్గం లేక గురువారం పురుగుల మందు తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్