బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత - టీచర్లు అరెస్ట్

1 గంట క్రితం

Tension at Vidyabhavan – Teachers arrested
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 12:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యా భవన్ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక టెట్ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ... ఎపిటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యా భవన్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో టీచర్లు తరలివచ్చారు. ఈ నిరసనకు ఆయా ప్రాంతాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న టీచర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. టీచర్ల ఆందోళనకు అనుమతి లేదని చెబుతున్నారు. విద్యాభవన్‌లోకి వెళ్లేందుకు యత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు తరహాలో తమకు టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పాస్ మార్కులు 40 శాతానికి తగ్గించాలని, ఆఫ్‌లైన్‌లో పరీక్ష పెట్టాలని, గణితం, సైన్స్ బోధించే వారికి వారి సబ్జెక్టులోనే పరీక్ష నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్