శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు నెలల్లో 12వ పిఆర్ సి నివేదిక ఇవ్వాలి

16 నవంబర్, 2026

prc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపి జెఎసి అమరావతి నాయకులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​12వ వేతన సవరణ సంఘం (పిఆర్ సి) నివేదికను ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఎపి జెఎసి అమరావతి నాయకులు కోరారు. గత 11వ పిఆర్ సి వల్ల తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 12వ పిఆర్ పిలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నాయకత్వంలో వివిధ అనుబంధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోమవారం ఎపి సచివాలయంలో పిఆర్ సి కమిషనర్ దినేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పిఆర్ సి నివేదిక రూపొందించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేసి, వీలైనంత త్వరగా ఆరు నెలల్లోనే ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పిఎస్ఎస్ఎన్ పి. శాస్త్రి, ఎస్ఎస్ ఎన్. రాజు, జి మోహన్ బాబు, ఆర్ఎ స్.ఎస్ ఎస్ రాజు, కె చంద్రశేఖర్, ఇర్ఫాన్, ఎ కుమార్ రెడ్డి, బిఎస్ ఆర్ ప్రసాద్, వి అర్లయ్య, షేక్ బాజీ, జనకుల శ్రీనివాసరావు, వైవి బ్రహ్మం, అంకాల కొండయ్య, జి శివానంద రెడ్డి, పి రజని, ఎస్ శివకుమారి రెడ్డి, విఎస్ సాయిలక్ష్మి, కె అనూష లత, ఎం సంధ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్