ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో విడతలోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి

11 గంటల క్రితం

Health condition of the student from Raptadu has improved Minister Lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 11:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ లోకేష్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో శనివారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నాయకులు తమ పరిధిలోని బూత్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల వ్యూహరచన పకడ్బందీగా ఉండాలని, ప్రతి ఓటు కీలకమనే విషయాన్ని గుర్తించి ప్రజలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. రెబల్స్ సమస్యల విషయంలో స్థానిక నాయకత్వంతో చర్చించి పరిష్కరించాలని, కూటమి పార్టీల మధ్య వంద శాతం ఓట్ల బదిలీ జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో చురుగ్గా పనిచేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తామని, నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్