- పోలీసుల చిత్రహింసల వల్లే చీకటి గోపి దుర్మరణం
- సిపిఎం, ప్రజా సంఘాల బృందం పరామర్శ
ప్రజాశక్తి-తాడికొండ: చీకటి గోపి కుటుంబానికి తక్షణమే 25 లక్షలు పరిహారం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని పొనెకల్లు గ్రామంలోని చీకటి గోపి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు చీకటి గోపీని ఒక దొంగతనం కేసు విచారణ కోసం పిలిపించినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పోలీస్ స్టేషన్‌లో అతనిపై తీవ్రంగా చిత్రహింసలు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని అన్నారు. గోపీ శరీరంపై కాళ్లు, ఒంటిపై గాయాల గుర్తులు ఉన్నట్లు, పోలీసుల హింస కారణంగానే గోపీ అనారోగ్యానికి గురై గుంటూరు ఆసుపత్రిలో మరణించాడని ఆరోపించారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనను పోలీసులు తీవ్రంగా హింసించారని గోపీ తన భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని అన్నారు. గోపీ మరణించి 16 రోజులు గడిచినా ఘటనపై సమగ్ర విచారణ జరపలేదని అన్నారు. పోస్టుమార్టం నివేదికను విడుదల చేయలేదని, పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన రికార్డులు, ఎలక్ట్రానిక్ ఆధారాలను బయటపెట్టలేదని ఆరోపణ చేసారు. డీఎస్పీ గోపీ సాధారణ జ్వరంతో మరణించాడని చెప్పడం వాస్తవాలను దాచే ప్రయత్నమని చేస్తున్నారని పమర్శించారు. గోపీ భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదులోని అనుమానాస్పద మరణం అంశాన్ని మార్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆరోపించారు. నేరంతో సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు చేస్తున్నారని విమర్శ.గోపీ మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
గోపీ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సి హెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి నేతాజీ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, భాస్కరరావు, శివ పార్వతి, శ్రీనివాసరావు, రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)