బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మక్కా సమీపంలో డ్రోన్‌ను కూల్చివేశాం : సౌదీ అరేబియా

1 గంట క్రితం

Mecca
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 11:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రియాద్‌ : ముస్లింల పవిత్ర నగరంపై ఉన్న నిషేధిత గగనతలంలోకి ప్రవేశించకముందే, హౌతీల డ్రోన్‌ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా వైమానిక రక్ష‍ణ వ్యవస్థ బుధవారం తెలిపింది. మంగళవారం సాయంత్రం ఈ డ్రోన్‌ను కూల్చివేసినట్లు వెల్లడించింది. ‘‘2017 జులైలో బాలిస్టిక్‌ క్ష‍ిపణి ప్రయోగం తర్వాత మక్కాను హౌతీలు లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండవ సారి’’ అని సైనిక ప్రతినిధి తుర్కీ అల్‌-మల్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్లాం పవిత్ర ప్రదేశాల్లో మక్కా ఒకటని, హజ్‌ యాత్ర చేపడుతుంటారని, కీలక భద్రతా వ్యవస్థ పరిధిలో ఉందని అన్నారు.

మక్కాను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలను హౌతీ అధికారులు ఖండించారు. మక్కాపై దాడి చేయలేదని హౌతీ రాజకీయ విభాగ సభ్యులు మహమ్మద్‌ అల్‌ -ఫరా పేర్కొన్నారు. ఈ ఆరోపణలు పచ్చి అబద్ధమని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్