లాస్ ఏంజెల్స్ : స్థానిక ఎన్‌బిసి న్యూస్ ఛానల్‌కి చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఎస్‌యువి, సిటీ బస్సు ప్రమాదాన్ని రిపోర్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదానికి గురైనది ఏంజెల్ సిటీ ఎయిర్‌కు చెందిన ‘న్యూస్‌చాపర్4’ అని ఎన్‌బిసిఎల్‌ఏ ధ్రువీకరించింది. ఈ ఘటన తమను దిగ్ర్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది.
లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా శాన్ ఫెర్నాండో వ్యాలీలోని చాట్స్‌వర్త్ ప్రాంతంలో ఒక గిడ్డంగి సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. వాణిజ్య భవనం పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక వ్యక్తి మరణించారని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి కెప్టెన్ బ్రాండెన్ సిల్వర్‌మాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన ఇద్దరూ విమానంలో ఉన్నవారా లేదా స్థానికులా అన్న వివరాలు తెలియరాలేదని అన్నారు. హెలికాప్టర్ కూలిన సమయంలో నాలుగు కార్లు, రెండు కంటైనర్లు దగ్ధమయ్యాయని అన్నారు.
ప్రమాదానికి గల కారణాలపై జాతీయ రవాణా భద్రతా బోర్డు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టనున్నాయి.








కామెంట్‌లు (0)