శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీ

1 గంట క్రితం

perni nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ‘మావిగన్’ అభివృద్ధిపై చర్చకు సిద్ధం?

- కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి పేర్ని నాని

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం అంతులేని దోపిడీ చేస్తోందని, రైతులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తోందని, అప్పుల కుప్పగా మార్చి ప్రశ్నిస్తే సోషల్ మీడియా పై అణచివేతకు దిగుతోందని మాజీ మంత్రి పేర్ని నాన్ని తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కాస్తా ఏడు బిల్డింగుల మున్సిపాలిటీ అయిందని అన్నారు. ‘మావిగన్’అభివృద్ధి అజెండా చూసి కూటమి ప్రభుత్వం వణుకుతోందని తెలిపారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతిని ఒక మోయలేని గుదిబండగా మార్చారని అన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ‘మావిగన్’ పేరుతో అభివృద్ధి చేయాలన్న వైయస్ జగన్ విజన్‌ను చూసి చంద్రబాబుతో సహా తొమ్మిది మంది మంత్రులు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి కథనాలు, రైతుల కన్నీళ్లు బయటకు రాకుండా ఉండేందుకు ‘మెటా’ వంటి అంతర్జాతీయ సంస్థలను లోబర్చుకుని సోషల్ మీడియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని విమర్శించారు. ఒకవైపు రాజధాని నిర్మాణ వ్యయం పేరుతో చదరపు అడుగుకు రూ.20 వేలు దోచుకుంటూ, మరోవైపు ప్రశ్నించిన కాపు, దళిత సామాజికవర్గాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో సిట్ అధికారులు పెద్ద డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. హాస్పిటళ్లలో మందుల బడ్జెట్ తగ్గినా పట్టించుకోని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, కేవలం జగన్‌ను తిట్టడానికే పరిగెత్తుకొస్తున్నారని విమర్శించారు. అమరావతి ఆర్థిక భారం మరియు ‘మావిగన్’ అభివృద్ధిపై తాము సూటిగా అడిగిన ప్రశ్నలకు లెక్కలతో సమాధానం చెప్పే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అని పేర్ని ప్రశ్నించారు. మావిగన్‌ ‌ప్రాంతంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (మావిగన్) ప్రాంతాలను కలుపుకుని అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది.ఇప్పటికే ఈ ప్రాంతంలో రెండు పెద్ద నగరాలు, అంతర్జాతీయ ప్రమాణాలున్న పోర్టు, రైల్వే కనెక్టివిటీ, జాతీయ రహదారులు ఉన్నాయని అన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాస్స్ ప్రాజెక్టు అన్న మీ మాటలు కూడా అంతే బోగస్సని పేర్కొన్నారు. అమరావతి ఏ విధంగా రాష్ట్రానికి ఆస్తి కాబోతుంది అంటే సమాధానం చెప్పడం లేదన్నారు. అమరావతిలో నీళ్లు తోడడానికి 17, 18 వేల క్యూసెక్కులు నీటిని తోడే సామర్ధ్యమున్న మోటార్లు పెడితే ఆ బిల్లు ఎవరు కడతారని ప్రశ్నించారు. పట్టిసీమకు కూడా అన్ని మోటార్లు లేవని, గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీరివ్వడానికి మీరు పెట్టిన మోటార్ల కెపాసిటీ కంటే అమరావతిలో వర్షపు నీరు తోడడానికి మీరు పెట్టి మోటార్ల కెపాసిటీ ఎక్కువని అన్నారు. 2016లోనే స్లాబ్‌లు, గోడలు పూర్తయిన ఐఏఎస్ బంగ్లాలు, జడ్జీల నివాసాలు, ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఇప్పుడు టైల్స్, రంగులు వేసి 2028లో ప్రారంభిస్తామనడం హాస్యాస్పదమని తెలిపారు. విజయవాడలో కాపురం ఉంటున్న ఏ ఐఏఎస్ అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబంతో అక్కడ నివసిస్తారో, కనీసం మంత్రులైనా ఉంటారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడ ఎకరం రూ.3.80 కోట్ల చొప్పున 5 ఎకరాలు కొన్నారని, ఎకరం విలువ రూ.4 కోట్లు కూడా లేనప్పుడు, మంత్రి నారాయణ ప్రభుత్వం దగ్గర ఉన్న మిగిలిన ఐదు వేల ఎకరాలు అమ్మి తెచ్చిన అప్పులు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజలు లేని చోట 4 స్టార్ హోటళ్లు పెడితే బ్యాంకులు దివాళా తీయడం ఖాయమని అన్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి బాగోతాన్ని, భూములిచ్చిన రైతుల కన్నీళ్లను 29 గ్రామాలు దాటి బయటకు రాకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తోందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్