ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జెన్‌జీపై వైసిపికి హక్కేది?

1 గంట క్రితం

viajy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ​: ​‘జెన్‌జీ’ గురించి వైసిపి నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎపి మాల వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పెదపూడి విజయ్‌కుమార్‌ విమర్శించారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చిన వైపిసికి యువశక్తి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బేతపూడి విజయశేఖర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్‌ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 8,571 కిలోమీటర్ల సిపి రోడ్లు, వందల కిలోమీటర్ల బిటి రోడ్లు నిర్మించారని, ‘అటవితల్లి బాట’ కింద డోలీ రహిత గ్రామాల కోసం 2,710 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారని చెప్పారు. మార్కాపురం ప్రాంతంలో దాదాపు రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.జల్‌జీవన్‌ మిషన్‌ పనుల శంకుస్థాపనకు అధికారికంగా ఆహ్వానం అందినా ఎమ్మెల్యే హాజరు కాలేదని విమర్శించారు. అసెంబ్లీకి దొంగచాటుగా వెళ్లి సంతకాలు చేసే వారికి ఉప ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో యువతకు సకాలంలో జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేదని, మెగా డీఎస్సీ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులను నిరాశకు గురిచేశారని ఆరోపించారు. యువతను గంజాయి, మాదకద్రవ్యాల వైపు నెట్టిన వైసిపి ఇప్పుడు ‘జెన్‌జీ వార్‌’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్