సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలోనే తొలి బిసి రక్షణ చట్టం

12 సెప్టెంబర్, 2026

bc welfare
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి సవిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు దేశంలోనే తొలిసారిగా ఎపిలో ‘బిసి రక్షణ చట్టం’ తీసుకొస్తున్నామని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు.శనివారం విజయవాడ సమీపంలోన ఉన్న గొల్లపూడి బిసి భవన్‌లో నిర్వహించిన ‘బిసి రక్షణ చట్టం’పై సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్ టిఆర్, మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిసిల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వెల్లడించారు. బిసిలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు సిఎం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యపడుతుందని చెప్పారు. బిసిలను కులం,వృత్తుల పేరుతో దూషించినా, సంఘ బహిష్కరణకు గురిచేసినా కఠిన శిక్షలు పడేలా జిల్లాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, 2 నెలల్లోనే విచారణ పూర్తిచేసేలా పక్కా నిబంధనలు రూపొందించామని స్పష్టం చేశారు. ఈ చట్టం కోర్టుల్లో బలంగా నిలబడేలా 156 బిసి కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకున్నామన్నారు. జగన్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లోబిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించి ద్రోహం చేసిందని మంత్రి విమర్శించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తుందని ప్రకటించారు. చేతివృత్తుల వారికి ఊతమిచ్చే ‘ఆదరణ 3.0’ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, పలు బిసి సంక్షేమ శాఖ కార్పొరేషన్ ఛైర్మన్లు వీరంకి వెంకట్ గురుమూర్తి, నందం అబద్ధయ్య, పేరేపి ఈశ్వరరావు, నర్సింహాయాదవ్, మల్లెల ఈశ్వర్, దేవేంద్రప్ప, చిలకలపూడి పాపారావు, కొల్లు పెద్ది రాజు, సిఆర్ రాజన్, రుద్రకోటి సదాశివ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్