సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదేళ్ల‌లో 20వేల స్టార్టప్ లు, లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యం

1 గంట క్రితం

nara lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 08:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి కొరియ‌న్ స్టార్ట‌ప్‌ల‌ను ఆహ్వానిస్తున్నాం

-​ భారతదేశ ఏఐ రాజధానిగా ఎపిని నిలపడమే ధ్యేయం

- కొరియన్ స్టార్టప్ ఫౌండ‌ర్ల‌ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌‌టిఐహెచ్‌)ద్వారా "వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ష నినాదంతో ఐదేళ్లలో 20వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సియోల్ బిజినెస్ ఏజెన్సీ (ఎస్‌‌బిఎ) కొరియన్ టెక్ స్టార్టప్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని సోమవారం ఆయన మాట్లాడారు. అమరావతిలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఆర్‌‌టిఐహెచ్‌ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం ప్రాంతీయ శాఖలతో ప‌నిచేస్తోంద‌న్నారు. స్పార్క్ (ఆలోచనల రూపకల్పన), క్యాటలిస్ట్ (18 వారాల ఇంక్యుబేషన్), వెలాసిటీ ల్యాబ్‌‌లలోకి కొరియన్ స్టార్టప్‌లను ఆహ్వానం పలుకుతున్నామ‌న్నారు. ఈ వేదిక ఇప్పటికే 2,500కు పైగా స్టార్టప్‌లకు మద్దతునిచ్చింది, 5,200కు పైగా ఎంటర్ ప్రెన్యూర్ లను భాగస్వాములను చేసిందని వివరించారు. ఎపి ఇన్నోవేషన్ అండ్‌ స్టార్టప్ పాలసీ 2024–29లో భాగంగా ప్రోటోటైపింగ్, డీప్-టెక్ గ్రాంట్ల కింద ₹22 కోట్ల ఆర్‌‌టిఐమెచ్‌-ఎస్‌ఐడిబిఐ సీడ్ ఫండ్, రూ.20 కోట్ల వరకు ఎఐఎఫ్‌ సీడ్ ఈక్విటీ, క్రెడిట్-గ్యారెంటీ వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చామని తెలిపారు. 160కి పైగా విసి ఏంజెల్ సిండికేషన్ నెట్‌వర్క్ కలిగిన ఆర్‌‌టిఐహెచ్‌ ఇప్పుడు ఏఐ, క్వాంటం, అధునాతన తయారీ కోసం ఎస్‌ఐడిబిఐ భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన డీప్-టెక్ ఏంజెల్ ఫండ్‌తో మరింతగా విస్తరించినట్లు తెలిపారు. ​​ఆర్‌‌టిఐహెచ్‌ కేంద్రంగా చేసుకుని ఇండియా-కొరియా స్టార్టప్ కారిడార్‌ ఏర్పాటు కోసం క‌లిసి ప‌నిచేద్దామ‌ని కొరియన్ సంస్థలను ఆహ్వానించారు. ఒక ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్-ల్యాండింగ్ "విసి బే", కొరియన్ ఏజెన్సీలతో (కోట్రా/కె-స్టార్టప్) సహ-ఇంక్యుబేషన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. దీనిద్వారా రెండువైపులా మార్కెట్ ప్రవేశం లభిస్తుందని, కొరియన్ స్టార్టప్‌లు భారతదేశంలోని టైర్ 2–3 మార్కెట్లలోకి, ఆంధ్రప్రదేశ్ స్టార్టప్‌లు కొరియాలోకి రావడం సులభతరమవుతుందని వివరించారు. తీరప్రాంతం వెంబడి లాజిస్టిక్స్, ఫిన్‌టెక్, డీప్-టెక్, ఫ్రాంటియర్ టెక్, అధునాతన తయారీ హబ్‌లలో పెట్టుబడులు కొరియన్ సంస్థలకు లాభసాటి కాగలవని ‌చెప్పారు. రిలయన్స్, సిఫీ, కంట్రోల్ఎస్ తదితర సంస్థలు ఏపీలో 10 గిగావాట్ల డేటా-సెంటర్ పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. తద్వారా స్టార్టప్‌లకు సరసమైన ధరలకు పెద్ద ఎత్తున కంప్యూటింగ్, డిజిటల్ మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.

​పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు కంపెనీల ప్రతినిధులను లోకేష్‌ ‌కోరారు. మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ సంస్థ షూఆల్స్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్ అండ్‌ సిఇవో లీ చియాంగ్-గెన్‌‌ను కలిసి రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. రాష్ట్రంలోని శ్రీసిటీలో రూ.338కోట్లతో సోలమ్ సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ పనులు పూర్తిచేసి, ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.ఆ కంపెనీ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హాను కోరారు. భారత్ లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని..డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్ ఏర్పాటుచేయాలని సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌ను కోరారు. శ్రీసిటీలో విద్యుత్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ప్రెసిడెంట్ యోకోటా తకేషిను కోరారు. సియోల్‌ ‌సెమీ కండక్టర్స్‌ ‌డిస్‌‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు చేయాలని సియోల్‌ ‌సెమీ కండక్టర్స్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌తాయొహ్యుంగ్‌ ‌లీని కోరారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు లోకేష్‌‌తో చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్