చీరాల (బాపట్ల) : '' ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉందని ... తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం `` అని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ... శుక్రవారం చీరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ .... దేశం గర్వించే కళ.. చేనేత కళ అని, మన రాష్ట్రం ఇలాంటి కళలకు నిలయమని అన్నారు. మన నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే చీర తయారు చేశారని గుర్తు చేశారు. చీరాల కర్చీఫ్‌లు ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేవారని తెలిపారు. చీరాలను ఒకప్పుడు మినీ ముంబయి అనేవారని అన్నారు. అనేక చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొచ్చారన్నారు. 1.27 లక్షల మంది ఈ రంగంపైనే ఆధారపడ్డారని తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నేత కార్మికులు టిడిపి కే ఓటు వేశారని ప్రశంసించారు. సబ్సిడీపై చేనేతలకు విద్యుత్ ఇస్తామన్నామని.. మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నామన్నారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేతలకు రూ.25 వేలు ఇస్తున్నామన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉందని ... తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం అని చెప్పారు. సంజీవని పేరుతో రూ.2.50 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నామన్నారు. ఎవరికీ ఇబ్బంది లేని పరిపాలన అందిస్తామని హామీ ఇచ్చామన్నారు. రెండేళ్లలో అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉంది.. తీర్చుకుంటాం : సిఎం చంద్రబాబు
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 07, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)