శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెన్షన్‌ వ్యాలిడేషన్‌ బిల్లును రద్దు చేయాలి..

16 నవంబర్, 2026

పెన్షన్‌ వ్యాలిడేషన్‌ బిల్లును రద్దు చేయాలి
- ఇపిఎఫ్‌ కార్యాలయాల ఎదుట పెన్షనర్ల ఆందోళన
ప్రజాశక్తి - యంత్రాంగం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 09:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇపిఎఫ్‌ కార్యాలయాల ఎదుట పెన్షనర్ల ఆందోళన

ప్రజాశక్తి - యంత్రాంగం : పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు-2025ను రద్దు చేయాలని, కనీస పింఛను రూ.తొమ్మిది వేలు చెల్లించాలంటూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఇపిఎఫ్‌ కార్యాలయం వద్ద పెన్షనర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కాకినాడ ఇపిఎఫ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాకినాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడు ఆచంట రామారావు ధర్నాను ప్రారంభించి మాట్లాడారు. రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏడాదిగా గ్రాడ్యూటీ చెల్లించకపోవడం దారుణమన్నారు. పెన్సనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఇపిఎస్-95 పెన్షనర్లు ఉన్నారన్నారు. వారిలో 36 లక్షల మందికి కనీసం నెలకు రూ.వెయ్యి పెన్షన్ కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల కార్పస్ ఫండ్‌లో నిధులు ఉన్నప్పటికీ కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. అధిక ధరలు, వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పెన్షనర్లకు అందుతున్న రాయితీలను తొలగించే ప్రయత్నాలు చేయడం తగదన్నారు. వెంటనే కనీస పింఛను రూ.తొమ్మిది వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇపిఎఫ్ కార్యాలయ సూపరింటెండెంట్ కు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ కు వినతిపత్రాలు అందించారు. విశాఖపట్నం మర్రిపాలెంలో ఉన్న పిఎఫ్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పిఎఫ్ రీజనల్ కమిషనర్ కె.అవినాష్ కుమార్‌కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

గుంటూరు కృష్ణ నగర్‌‌లోని రీజనల్‌ ‌పిఎఫ్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రీజనల్‌ ఇపిఎఫ్‌ ‌కమిషనర్‌ ‌తానయ్యకు వినతిపత్రం అందచేశారు. ధర్నా వద్దకు కమిషనర్‌ వచ్చి, పెన్షనర్లతో మాట్లాడారు. కోర్కెలు పత్రాన్ని ఢిల్లీలో తమ కేంద్ర కార్యాలయానికి పంపిస్తామని, తమ పరిధిలోని సమస్యలను పరిష్కారం చేస్తామని హమీ ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్