శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కానిస్టేబుల్ పోస్టుల్లో మిగిలిన 400 భర్తీ చేయాలి

5 రోజుల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి : హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి: పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో మిగిలిపోయిన 400 ఖాళీలను తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. మెరిట్‌, రిజర్వేషన్‌ నిబంధనలను అనుసరించి ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలిని (ఎస్ఎల్‌‌పిఆర్‌‌బి) ఆదేశించింది. నాలుగు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు వంటి ప్రాథమిక దశల్లో అభ్యర్థులు వైదొలిగినప్పుడు తదుపరి మెరిట్‌ అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని పేర్కొంది. నోటిఫికేషన్‌లో చేర్చిన క్లాజ్‌ 33(9) చెల్లదని ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌ విజయ్‌ తీర్పు వెలువరించారు. రాష్ట్ర పోలీసు శాఖలో 6,511 పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నియామక మండలి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎంపికైన అభ్యర్థులు ఇతర కారణాలతో వైదొలగడంతో 400 పోస్టులు ఖాళీగా మిగిలాయి. వీటిని తదుపరి మెరిట్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్