శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటేయడానికి తప్పని డోలుమోతలు

2 రోజుల క్రితం

ఓటు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 10:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రోడ్డు కోసం ఓట్లు వేస్తున్నాం

- జీలుగులోవ గిరిజనులు వినూతన కార్యక్రమం

ప్రజాశక్తి - రావికత: అనకాపల్లి జిల్లా రావికత మండలం చీమలపాడు పంచాయతీ జీలుగులోవ పశువులు బందకొంది గిరిజనులు 18 మందికి కొత్తగా ఓట్లు వచ్చాయి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా మొదటిసారి ఓట్లు ఇచ్చిన అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఓట్లు వేయడం కోసం కొర్ర గాసన్న(80) వృద్ధుడు నడవలేని పరిస్థితిలో గ్రామస్తులు ఆధ్వర్యంలో డోలి కట్టి చీమలపాడు పోలింగ్ కేంద్రానికి కనీసం 13 కిలోమీటర్ల దూరం మోసుకొని వచ్చారు. ''నేటికీ మాకు రోడ్డు లేదు.. రోడ్డు వేయండి. మేము ఓటు వేస్తున్నాం.'' అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా పోలింగ్ కేంద్రాన్ని బయలుదేరారు. ఈ కార్యక్రమానికి కొర్ర బాలరాజు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. జెడ్ కొత్తపట్నం ఎంపీటీసీ అభ్యర్థి సింగర్ పాలసీయా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్