- కేరళం ముఖ్యమంత్రి విడి.సతీశన్
ప్రజాశక్తి - పుట్టపర్తి అర్బన్ : సత్యసాయి మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని, ఆయన ఆశయాలను సత్యసాయి ట్రస్ట్ కొనసాగిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని కేరళం ముఖ్యమంత్రి విడి.సతీశన్ పేర్కొన్నారు. సత్యసాయి 101వ జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో సోమవారం జరిగాయి. ఈ జయంత్యుత్సవాలకు సతీశన్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సత్యసాయికి, కేరళం ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమన్నారు. 2018లో కేరళంలో సంభవించిన విధ్వంసకర వరదల సమయంలో సత్యసాయి ఆదేశాల మేరకు యాత్రికులు అందించిన సేవలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. విద్య, వైద్యం సామాజిక రంగాల్లో అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి అభినందించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేరళంకు పుట్టపర్తి విమాన్రాశయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ఆశయ సాధనలో భాగంగా ట్రస్ట్ చేపడుతున్న విద్యా, వైద్యం, తాగునీటి సేవా కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. నాణ్యతతో కూడిన ఉచిత వైద్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించేలా విద్యను అందిస్తున్న సత్యసాయి విద్యాసంస్థల సేవలను అభినందనీయమన్నారు. యువత బాబా సూక్తులను ఆచరణగా తీసుకుని మానవత్వంతో ఉన్నత లక్ష్యాలను సాధించుకుని తల్లిదండ్రులు, గురువులు, మహిళపై గౌరవభావంతో మెలగాలని సూచించారు. కార్యక్రమం అనంతరం సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్... ముఖ్యమంత్రికి, కిషన్ రెడ్డికి సత్యసాయి చిత్ర పటాన్ని బహూకరించారు.











కామెంట్‌లు (0)