సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెరిఫికేషన్‌, వాలిడేషన్‌ చట్టాన్ని రద్దు చేయాలి

19 సెప్టెంబర్, 2026

bsnl
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:19 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పలువురు వక్తల డిమాండ్‌

- రాష్ట్ర వ్యాప్త విశ్రాంత ఉద్యోగుల ఆందోళన

ప్రజాశక్తి - విజయవాడ : నిరంతరం అన్ని కేటగిరీల పెన్షనర్ల మెడ మీద కత్తిలా వెళ్లాడుతున్న పెన్షన్ వెరిఫికేషన్.. వాలిడేషన్ చట్టం - 2025ను తక్షణమే రద్దుచేయాలని, నకారా తీర్పును అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఫోరమ్‌ ఆఫ్‌ ‌సివిల్‌ ‌పెన్షనర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌‌సిపిఎ) ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వ వివిధ కేటగిరీల పెన్షనర్ల సంఘాలు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమాలు శనివారం ముగిశాయి. దీనిలో భాగంగా విజయవాడ ధర్నా చౌక్‌‌లో శనివారం జరిగిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు పోటెత్తారు. సర్వీసులో ఉన్న ఉద్యోగుల సంఘాల నాయకులు పలువురు ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎఫ్‌‌సిపిఎ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో నేతలు మాట్లాడుతూ ఎన్‌‌పిఎస్‌, యుపిఎస్‌‌లను రద్దుచేసి.. పూర్తి ప్రయోజనాలతో అన్ని రకాల ఉద్యోగులకు ఒపిఎస్‌‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎనిమిదో సిపిసి టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌‌ను సవరించి, పెన్షన్ రివిజన్‌ను చేర్చాలని.. జాప్యం కారణంగా ఐఆర్ మంజూరు చేయాలని, బిఎస్‌ఎంఎల్‌ / ఎంటిఎన్‌ఎల్ పెన్షనర్లకు 2017 జనవరి ఒకటి నుంచి పెన్షన్ రివిజన్ మంజూరు చేయాలని, బ్యాంకు పెన్షనర్లకు పెన్షన్ అప్‌డేషన్ మంజూరు చేయాలని, ‌డిఎ/డిఆర్‌‌లో 50 శాతాన్ని పే / పెన్షన్‌‌తో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. పెన్షన్‌లో సమానత్వాన్ని నిర్ధారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతికూల వైఖరిని కొనసాగిస్తే నవంబర్ 25న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ పార్లమెంట్ మార్చ్.. సామూహిక ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఆయా సంఘాలకు చెందిన నేతలు పి అశోక్‌ బాబు, ఎన్ రామారావు, కెఎస్‌‌సి బోస్, ఎన్ నాగేశ్వరరావు, ఎ చంద్రశేఖర్ శేఖర్, ఎంఎ రహిమాన్, నాంచారయ్య, వివి రమణ రాజు, ఎంఎ శాస్త్రి, శ్రీనివాసరావు, ఎస్ జామిలీరెడ్డి, ఎస్ కృష్ణ, బాలాజీ సిఎస్, ఎ నాగేంద్ర బాబు, వి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్