మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోడిపుంజుల ఫారంలో చోరీ కలకలం

2 రోజుల క్రితం

kodi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 10:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- దాడి చేయడంతో యువకుడు మృతి

ప్రజాశక్తి-కోరుకొండ : తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడిలోని కోడిపుంజుల ఫారంలో చోరీ నేపథ్యంలో జరిగిన దాడిలో యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తిమ్మసత్తి నరేష్‌ (31) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఎన్‌టిఆర్ జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామానికి చెందిన తిమ్మసత్తి నరేష్‌ (310 బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య అఖిల, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మధురపూడిలోని కోడిపుంజుల ఫారంలో దొంగతనం చేసేందుకు మరో ముగ్గురితో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఫారం యజమాని, సిబ్బంది గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా నరేష్‌ చిక్కారు. ఫారం యజమాని, సిబ్బంది దాడి చేయడంతో నరేష్‌ మృతి చెందినట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. యువకుడి మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్