శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు ఆలయాల్లో చోరీలు

15 నవంబర్, 2026

రెండు ఆలయాల్లో చోరీలు
- వెండి ఆభరణాలు, హుండీ నగదు అపహరణ
- సిసి కెమెరాలు ధ్వంసం.. డివిఆర్‌ ఎత్తుకెళ్లిన దుండగులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వెండి ఆభరణాలు, హుండీ నగదు అపహరణ

- సిసి కెమెరాలు ధ్వంసం.. డివిఆర్‌ ఎత్తుకెళ్లిన దుండగులు

​ప్రజాశక్తి - మార్టూరు (బాపట్ల జిల్లా), హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా) : రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. దుండగులు వెండి ఆభరణాలు, హుండీలో నగదు అపహరించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు స్వామివారి వెండి ఆభరణాలను దొంగిలించారు. సుమారు పది లక్షల రూపాయల విలువైన ఆరు కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు గుర్తించారు. చోరీ అనంతరం ఆధారాలు లభించకుండా ఉండేందుకు గుడిలోని సిసి కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు డివిఆర్ బాక్స్‌ను సైతం ఎత్తుకెళ్లారు. ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మార్టూరు సిఐ యార్లగడ్డ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాపట్ల జిల్లా క్లూస్ టీంను రంగంలోకి దించి వేలిముద్రలు, ఇతర భౌతిక ఆధారాలను సేకరించే చర్యలు చేపట్టారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సడ్లపల్లి గ్రామ నడిబొడ్డున ఉన్న ఆంజనేస్వామి దేవాలయంలో దుండగులు చొరబడి ముందుగా సిసి కెమెరాలను తొలగించారు. అనంతరం హుండీని పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. హుండీలో రూ.80 వేల నుంచి లక్ష రూపాయల వరకు నగదు ఉన్నట్లు గ్రామస్తులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్