శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్డులకూ మూడేళ్ల వనవాసం

15 నవంబర్, 2026

driving
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 09:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- పెండింగ్‌‌లో 64 లక్షల డిజిటల్‌ కార్డులు

- నేటి నుంచి 39.64 లక్షలు పంపిణీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మూడేళ్లుగా వాహనదారులను ఊరించిన డిజిటల్‌ కార్డుల (డ్రైవింగ్‌ ‌లైసెన్స్‌, ఆర్‌‌సి బుక్‌) పంపిణీకి ఎట్టకేలకు ప్రభుత్వం సిద్ధమైంది. లక్షలాది మంది వాహనదారులను ఇన్నాళ్లూ నిరీక్షణలో ఉంచిన రవాణాశాఖ, సోమవారం నుంచి కార్డుల పంపిణీ చేపట్టనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2023 ఆగస్టు ఒకటి నుంచి సుమారు 64 లక్షల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో భాగంగా తొలిదశలో 2024 అక్టోబరు ఒకటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న 39.64 లక్షల కార్డులను పంపిణీ చేయనున్నారు. వీటికి ఒక్కో వాహనదారుడి నుంచి రూ.235 చొప్పున రవాణాశాఖ వసూలు చేసింది. 2023 ఆగస్టు ఒకటి నుంచి 2024 సెప్టెంబరు 30 వరకు పెండింగ్‌లో ఉన్న 24.36 లక్షల కార్డులకు సంబంధించి వాహనదారుల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయలేదు. వీటిని పొందాలనుకునేవారు ఒక్కో కార్డుకు రూ.235 చెల్లించాలని పేర్కొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కార్డుల ప్రింటింగ్‌ బాధ్యతలను ఓ కాంట్రాక్టరుకు అప్పగించింది. ఒక్కో కార్డును రూ.42.26 చొప్పున ముద్రించేలా ఒప్పందం కుదుర్చుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్