శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రేపు తుపానుగా.. వాయుగుండం

15 నవంబర్, 2026

weather
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తీవ్ర తుపానుగా మారే అవకాశం

  • విపత్తుల నిర్వహణ సంస్థ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం ఆదివారం సాయంత్రానికి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది శ్రీలంకలోని టింకోమలికి 620 కిలోమీటర్లు, శ్రీవిజయపురానికి (అండమాన్ నికోబార్ దీవులు) 680 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 960 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఆ సంస్థ మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌ప్రఖర్‌ ‌జైన్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ఉత్తర -వాయవ్య దిశగా పయనిస్తూ సోమవారానికి దక్షిణ, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో తుపానుగా, మంగళవారం నాటికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఆ తదుపరి రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి మంగళవారం వరకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఆ తరువాత గాలుల వేగం క్రమంగా పెరుగుతుందని తెలిపారు. తుపాను నేపత్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో పంట చేతికి వచ్చే స్థితిలో ఉన్నందున తుపానును దృష్టిలో ఉంచుకుని రైతులు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను గురించి సోషల్‌ ‌మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విస్మరించి ప్రభుత్వం అందించే సూచనలను పాటించాలని కోరారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రాయలసీమలో ఆదివారం ఒకటి, రెండు చోట్ల వర్షాలు కురిశాయని, కోస్తా ఆంధ్ర, యానాంలలో పొడి వాతావరణం నెలకొందని తెలిపారు. ఇప్పటికే రెండు తుపాన్ల బారిన పడి భారీగా నష్టపోయిన రైతులు మరో తుపాను వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్