- న్యూ పిడుగురాళ్ల వద్ద విద్యుత్తు వైర్లు
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (పల్నాడు జిల్లా): పల్నాడు జిల్లాలోని న్యూ పిడుగురాళ్ల వద్ద విద్యుత్తు వైర్లు తెగిపోవడంతో సికింద్రాబాద్-గుంటూరు సెక్షన్ మధ్య పలు రైళ్లు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కొచ్చివెళ్లి వెళ్లే శబరి ఎక్స్‌ప్రెస్‌ను పిడుగురాళ్ల స్టేషన్‌లో నిలిపివేశారు. నాలుగు గంటలకు రావాల్సిన ఈ రైలు ఎనిమిది గంటలకు సత్తెనపల్లికి రైల్వేస్టేషన్‌కు చేరే అవకాశం ఉంది. వికారాబాద్ నుంచి గుంటూరు వచ్చే పల్నాడు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి పలాస వెళ్లే ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్లే చెన్నై ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.








కామెంట్‌లు (0)