- స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జెన్‌కో ఎండి నాగలక్ష్మీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ట్రాన్స్‌కో ప్రసార సాంకేతిక నష్టాలను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 2.6శాతం తగ్గించామని జెన్‌కో ఎండి ఎస్ నాగలక్ష్మీ అన్నారు. విద్యుత్ సౌదలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సందర్భంగా ట్రాన్స్‌కో జెఎండి సాయిసూర్య ప్రవీణ్ చంద్‌తో కలిసిఆమె జాతీయ జెండాను శనివారం ఆవిష్కరించి ప్రసంగించారు. స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల స్ఫూర్తితో దేశ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. విద్యుత్ రంగాన్ని దేశంలోనే అత్యుత్తమంగా నిలపడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ సంస్థల అధికారులు, ఇంజనీర్లు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులోనూ విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు. 2026 జూన్ నాటికి రాష్ట్రంలో 112.45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కేటాయించబడ్డాయని చెప్పారు.
సిపిడిసిఎల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఎపిసిపిడిసిఎల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం జరిగాయి. ఆ సంస్థ సిఎండి పి పుల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ రంగ అభివృద్ధితో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆవుల మురళీకృష్ణ యాదవ్, ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిడిసిఎల్ స్కాడా కంట్రోల్ రూమ్ నుంచి ఆన్‌లైన్‌లో విద్యుత్ సరఫరా నియంత్రణ ప్రక్రియను, నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని కూడా సీఎండీ ప్రారంభించారు.








కామెంట్‌లు (0)