ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల కేంద్రమైన ఆలమూరు తాహసిల్దార్ కార్యాలయం ఎదుట గల ధర్నా చౌక్ లో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చేస్తున్న నిరవధిక సమ్మెలో సోమవారం 13 వ రోజు వంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల విఆర్ఎల సంఘం అధ్యక్షులు తాతపూడి ఇస్సాక్ మాట్లాడుతూ ప్రక్క తెలుగు రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పే స్కేల్ ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలని, మరణించిన విఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి కారుణ్య నియామకం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కె.శివరామారావు, ఉపాధ్యక్షుడు భువనగిరి ఏసు, సలహాదారుడు నాగేశ్వరరావు, ట్రెజరర్ కుందేటి శ్రీను, సభ్యులు యార్లగడ్డ జీవరత్నం ఏడిది వెంకటాద్రి, బూరిగ మంగాలక్ష్మీ, చోడవరపు రామలక్ష్మి, కోట లక్ష్మీ, షేక్ బషీర్ బిబి, తదితరులు పాల్గొన్నారు.
13వ రోజు ఒంటికాలిపై నిలబడి విఆర్ఎల నిరసన
38 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 04:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)