ప్రజాశక్తి – అనంతగిరి (అనకాపల్లి జిల్లా): తీవ్ర తుపాను కారణంగా రహదారి కొట్టుకుపోవడంతో ఓ గర్భిణిని కుటుంబ సభ్యులు డోలీ సాయంతో ఆస్పత్రికి తరలించారు. అనకాపల్లి జిల్లా అనంతగిరి మండలంలోని బొడ్డపుట్టు ప్రధాన రహదారి నుంచి తెల్లరపాడు గ్రామం వరకు రెండేళ్ల క్రితం నిర్మించిన తాత్కాలిక రహదారి ఇటీవల వచ్చిన అర్నబ్ తుపాను ధాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గ్రామ ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తెల్లరపాడు పీవీటీజీ గ్రామానికి చెందిన గర్భిణి కిల్లో నీలిమకు శుక్రవారం తెల్లవారుజామున పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అయితే, రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి వాహనంలో తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో ఆమె భర్త రాజుతోపాటు కుటుంబ సభ్యులు డోలీ సాయంతో సుమారు మూడు కిలోమీటర్ల దూరం మోసుకుంటూ బొడ్డపుట్టు ప్రధాన రహదారి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో లుంగపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చేర్పించారు. రహదారి సౌకర్యం లేక గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిని పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Print Editionడోలీలో గర్భిణిని తరలింపు
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)