శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గిరిజన తల్లికి అంబులెన్స్ అందని దుస్థితి

4 రోజుల క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 09:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రభుత్వంపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు

విజయనగరం: రాష్ట్రంలో విజన్ 2047, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం వ్యాలీ అంటూ అభివృద్ధి గురించి గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. గిరిజన ప్రాంతాల్లో కనీస రహదారి, అంబులెన్స్ సౌకర్యాలు కల్పించలేకపోతోందని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం పల్లపు దుంగాడ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాకపోవడంతో ఓ గిరిజన తల్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనను ఆయన ప్రస్తావించారు. దెబ్బతిన్న రోడ్లు, కొండవాగులు దాటుకుంటూ సుమారు ఏడు కిలోమీటర్ల దూరం బిడ్డను భుజాలపై మోసుకెళ్లి ఆసుపత్రికి తీసుకెళ్లిందని, చికిత్స అనంతరం తిరిగి అలాగే ఇంటికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు. ఒకవైపు విశాఖపట్నంలో గూగుల్ వంటి సంస్థల కోసం వేగంగా మౌలిక వసతులు కల్పిస్తున్నారని, మరోవైపు ఉత్తరాంధ్రలోని గిరిజన గ్రామాలకు అంబులెన్స్ వెళ్లే రహదారులు కూడా లేవని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ సామాన్య ప్రజల ప్రాణాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మంత్రి సత్యకుమార్‌కు ప్రశ్నలు

ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఉద్దేశించి కేతిరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. 108కు ఫోన్ చేసినా అంబులెన్స్ ఎందుకు రాలేదు? గిరిజన గ్రామాల్లో అంబులెన్స్ సేవలు ఎందుకు అందుబాటులో లేవు? ఫీడర్ అంబులెన్స్‌లు, బైక్ అంబులెన్స్‌ల పరిస్థితి ఏమిటి? రాజకీయాలపై చూపిస్తున్న శ్రద్ధను ప్రజల ప్రాణాలను కాపాడటంపైనా చూపించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రతి గిరిజన గూడేనికి అంబులెన్స్ సేవలు చేరేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్