బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కడుపునొప్పితో గిరిజన విద్యార్థిని మృతి

4 రోజుల క్రితం

కడుపునొప్పితో గిరిజన విద్యార్థిని మృతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) :కడుపునొప్పితో గిరిజన విద్యార్థిని మృతి చెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకూటి పంచాయతీ పరిధిలోని దిగువ కాషాయవలస గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరల మేరకు.. కాషాయవలస గ్రామానికి చెందిన తాడంగి రాజారావు, అమ్మాజీ దంపతుల కుమార్తె లావణ్య (14) కురుకూటి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఈ నెల 11న విద్యార్థిని రజస్వల కావడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుని బాలికను స్వగ్రామానికి పంపించారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం గురువారం మంగళస్నానం చేయించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగా లావణ్యకు తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో బాలిక కుప్పకూలి మృతి చెందింది. కురుకూటి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి శివ, ఉపాధ్యాయ సిబ్బంది దిగువ కాషాయవలస వచ్చి లావణ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లెదుటే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్