ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరవీరుడు ‘పెంచలయ్య’కు అరుణాంజలి

13 గంటల క్రితం

అమరవీరుడు ‘పెంచలయ్య’కు అరుణాంజలి
- మన్సూర్ భవన్‌లో ప్రథమ వర్థంతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 09:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మన్సూర్ భవన్‌లో ప్రథమ వర్థంతి

ప్రజాశక్తి - నెల్లూరు : గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గంజాయి మూకల చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన పెంచలయ్య ప్రథమ వర్థంతి వేదాయపాలెంలోని మన్సూర్ భవన్‌లో సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పెంచలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెంచలయ్య ప్రజానాట్యమండలి కళాకారుడుగా, పార్టీ సభ్యుడుగా పనిచేస్తూ యువతను చైతన్యం చేశారన్నారు. రూరల్ 33 వ డివిజన్, పరిధిలో ఉన్న ఆర్‌‌డిటి కాలనీలో పోలీసులు, స్థానికుల సహకారంతో గ్రామ కమిటీ ఏర్పాటు చేసి, గంజాయి అమ్మకాలు జరగకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. దీనిని సహించలేని వారు అత్యంత కిరాతకంగా మారణాయుధాలతో దాడి చేసి చేశారని గుర్తు చేశారు. పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ ‌చేశారు. ఆయన ఆశయ సాధన కోసం పనిచేయడమే పెంచలయ్యకు మనం అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్, కె.పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్