మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేంద్ర మంత్రి ఇలాకాలో కమలానికి ‘కూటమి’ షాక్‌

5 గంటల క్రితం

bjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-‌ భీమవరంలో ఐదు కౌన్సిలర్ స్థానాలే కేటాయించిన టిడిపి, జనసేన

- కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తీవ్ర ఆగ్రహం

- అన్ని స్థానాల్లో పోటీ చేస్తమంటూ ప్రకటన

- 36 వార్డుల్లో బిజెపి నామినేషన్లు దాఖలు

ప్రజాశక్తి - భీమవరం : ‌పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇలాకా భీమవరం మున్సిపాల్టీలో టిడిపి, జనసేనలు బిజెపికి షాక్‌ ఇచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి కేవలం ఐదు వార్డులే కేటాయించాయి. అద కూడా మంత్రికి ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా, ఆయన ఇంటి చుట్టుక్కల కేటాయించి సరిపెట్టాయి. దీంతో ఆయన ఒక్క సారిగా భగ్గుమన్నారు. ఇది తనను మాత్రమే అవమానపరచడం కాదని, మొత్తం బిజెపిని అవమానపరచడమని అన్నారు. భీమవరంలో అన్ని స్థానాలకు పోటీ చేసే సత్తా తమకు ఉందని అన్నారు. మంత్రి వ్యాఖ్యల నేపధ్యలో సోమవారం సాయంత్రానికి 36 వార్డులకు బిజెపి తరపున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామం కూటమి శ్రేణుల్లో కలకలం రేపింది.

మంత్రి ఏమన్నారు?

" కూటమి నాయకుల వైఖరి సరికాదు. బిజెపి కి కనీస సమాచారం ఇవ్వకుండా టిడిపి, జనసేన సొంతంగా అభ్యర్థుల జాబితా ప్రకటించడం అవమానకరం. మొత్తం 52 వార్డుల్లో బీజేపీకి సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. ఐదు వార్డులు ఇస్తామన్నారు. ఆ వార్డులు ఏమిటో కూడా వారే నిర్ణయించారు. నా ఇంటి పక్కన ఉన్న ఐదు వార్డులు మాకు కేటాయించారు. ఇది సమంజసం కాదు. మా క్యాడర్ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీట్లు ఇవ్వాలి. మా సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ తనయుడికి సైతం అవకాశం ఇవ్వలేదు. 1981 నుంచి భీమవరం మున్సిపాలిటీలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ బిజెపికి ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది. అన్ని వార్డుల్లో సొంతంగా పోటీ చేసే బలం, బలగం ఉన్నాయి. అవసరమైతే అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తాం. పొత్తులో కేటాయించే స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి బీజేపీ సత్తా చాటగలదు. అని శ్రీనివాస వర్మ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్