మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బియ్యం ధరలు చూస్తుంటే..

2 గంటల క్రితం

sasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 02:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బియ్యం ధరలను చూస్తుంటే

భయం పుడుతోంది..భయ్యా

కిలో బియ్యం ధర వందకి చేరే

ఇంటిల్లిపాదీ ఎంతగా కష్టపడినా

గంజి తాగే తిండి గింజలు కరువు

సామాన్యుడి పరిస్థితి అధ్వానం..!

​

కార్పొరేట్లకు జనం సొమ్ము పంచుతూ

అన్ని రేట్లను తెర చాటున పెంచే ప్రభుత్వం

అడిగేందుకు అన్ని హక్కులను కోల్పోయాం

ధరలు పెంపులో దొరల పెనుమాయ

సగటు మనిషి గొంతులోన కరక్కాయ..!

​

ఎల్ నినో ప్రభావంతో ఉపాధి భారం

వలసలు పోయినా తలసరి కూలీ కరువు

బియ్యం పెంపును అయ్యలు ఆపలేరు

నిత్యావసర ధరలు నింగినంటుతుండే

పిల్లాపాపలతో ఎలా గడపాలి ప్రజలు..?

​

ధరలు పెరుగుతున్నా గద్దెనెక్కిన దొరలు

నోటి నుంచి ఉత్తుత్తి ప్రకటనలే దొరలు

కింది స్థాయిలో కార్యాచరణ వుండదు

ధరలను తగ్గించేవరకు ఏలికలను నిలదీయాలి

సామాన్యుల నిరసనలు సెగలు పుట్టించాలి..!

​- జి. సూర్యనారాయణ,

సెల్‌: 6281725659.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్