సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్మికురాలిపై పెట్రోల్‌తో దాడి చేసిన నిందితుల అరెస్టు

1 గంట క్రితం

remand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆరుగురికి రిమాండ్‌

ప్రజాశక్తి - ఆదోని : మున్సిపాలిటీలో కాంట్రాక్ట్‌ కార్మికురాలిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్లు కర్నూలు జిల్లా ఆదోని డిఎస్‌‌పి వెంకటరమణ తెలిపారు. సోమవారం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిఐలు రాజశేఖర్‌రెడ్డి, రామలింగయ్యతో కలిసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల ఆరున ఉదయం 5.30 గంటల సమయంలో ఆర్‌‌టిసి బస్టాండ్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శిరీష, రాములమ్మ, సుజాత, ఐసి.హేమ, అంజినమ్మతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈరన్న అనే వ్యక్తి ఆత్మహత్యకు నరసమ్మ కారణమని భావించి నిందితులు ఆమెపై కక్ష పెంచుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. గతంలోనూ ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి కేసులు నమోదయ్యాయని, అనంతరం లోక్‌ అదాలత్‌లో రాజీ అయ్యారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్