శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition26, 27 తేదీల్లో ఉప రాష్ట్రపతి తిరుమల పర్యటన

24 అక్టోబర్, 2026

cpradhakrishnan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రేణిగుంట : ఈ నెల 26, 27 తేదీల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా శ్రేణి లైజన్ అధికారుల సమన్వయ సమావేశంలో ఎస్‌‌పి ఎల్.సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ, ఉప రాష్ట్రపతి కార్యాలయ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయంలోని విఐపి లాంజ్‌లో అవసరమైన అన్ని సదుపాయాలూ కల్పించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ అంశాలు, కేటాయించిన విధుల్లో అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని డిఎస్ఒకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, అడిషనల్ ఎస్‌‌పి శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి, తిరుపతి ఆర్‌డిఒలు భాను ప్రకాష్ రెడ్డి, రామ్మోహన్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్