గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రక్షణ కల్పించాలంటూ సిఐకి వినతిపత్రం సమర్పించిన బాధితురాలు

58 నిమిషాల క్రితం

peeleru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పీలేరు : తనపై జరుగుతున్న వేధింపులు, దాడులపై మానవతా దృక్పథంతో స్పందించి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ తలుపుల పంచాయతీ వడ్డీపల్లికి చెందిన వి. రాధ గురువారం పీలేరు సీఐ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితురాలు రాధ మాట్లాడుతూ.. మధుమేహం కారణంగా తన కుడికాలు తొలగించారని, పక్షవాతం కారణంగా ఎడమ కాలు, చేయి సరిగా పనిచేయడం లేదని తెలిపారు. సుమారు 30 ఏళ్లుగా గ్రామంలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న తనను పసుపులేటి వెంకటేశ్వర, ఆయన తల్లి లక్ష్మీదేవిలు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తనపై దాడి చేసి బయటకు లాగివేశారని, అడ్డుకున్న తన భర్త, కుమార్తె, అల్లుడు, సోదరిపై కూడా దాడి చేశారని వాపోయారు. గత మూడేళ్లుగా ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంటి వివాదంపై తాను కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ పొందినట్లు చెప్పారు. పోలీసులు సమస్యను పూర్తిగా పరిశీలించి తనకు రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని కోరారు. విషయం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలు రాధ కు సీఐ భరోసా ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్