గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీఆర్ఎల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

1 గంట క్రితం

annamayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 05:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పే స్కేలు, ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్

ప్రజాశక్తి - పీలేరు: ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఎ) న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో దీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నారు. వీఆర్ఎల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఎన్.పెద్దన్న పిలుపుమేరకు గురువారం పీలేరు తహశీల్దారు కార్యాలయం ఆవరణలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు నాగరత్న మాట్లాడుతూ.. వీఆర్ఎల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 17, 18 తేదీల్లో మంగళగిరిలో రిలే దీక్షలు, ఆగస్టు 19న ‘చలో సీసీఎల్ఏ కార్యాలయం’ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోవడంతో సెప్టెంబర్ 16 నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టామన్నారు. ఈ విషయంగా సీసీఎల్ఏ అధికారులకు ముందస్తు నోటీసు ఇచ్చామని అన్నారు. వీఆర్ఎలకు పే స్కేలు అమలు చేయాలని, నామినీలను వీఆర్ఎలుగా నియమించాలని, అర్హులైన వీఆర్ఎలందరికీ ప్రమోషన్లు కల్పించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని దీక్షా శిబిరంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు దీక్షా శిబిరాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీలేరు మండల పరిధిలోని విఆర్ఏలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్