ప్రజాశక్తి - తిరుమల : త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు మాజీ రాజ్యసభ సభ్యులు వి. విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఈ నెల తరువాత పూర్తి వివరాలు వెల్లడించస్తానని ప్రకటించారు. ఈ కొత్త ప్రయత్నం విజయవంతం కావాలని కోరుతూ తన కుటుబంతో కలిసి తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తిరుమల ఆలయ దర్శనం అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రజా గళాన్ని పార్లమెంటు, అసెంబ్లీలో వినిపించడమే తమ పార్టీ లక్ష్యమని, ప్రజల సమస్యలను లేవనెత్తే వారి తరఫున పోరాడే వేదికగా ఈ పార్టీ నిలుస్తుందన్నారు.








కామెంట్‌లు (0)