ప్రజాశక్తి-విజయనగరం కోట: విజయనగరం జిల్లాలో నాలుగు నూతన అగ్నిమాపక కేంద్రాలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం అగ్నిమాపక కేంద్రం నూతన భవనానికి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఫైర్ సిబ్బంది ఉపయోగించే పరికరాల పనితీరును అధికారులు మంత్రికి వివరించారు. విజయనగరం అగ్నిమాపక కేంద్రం నూతన భవనంలోని వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. పూసపాటిరేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను ఆమె ప్రత్యక్షంగా ప్రారంభించగా.. సోంపేట, పాలకొండలో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను విజయనగరం నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. గత రెండేళ్లలో అగ్నిమాపక శాఖలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. విజయనగరం అగ్నిమాపక కేంద్రానికి చారిత్రక ప్రాధాన్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నందున వాటి భద్రతకు అగ్నిమాపక శాఖ సేవలు కీలకమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఇప్పటికే రెండుసార్లు అగ్నిమాపక వాహనాలను ప్రారంభించామని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి అనిత వెల్లడించారు.
విజయనగరం జిల్లాలో నాలుగు నూతన అగ్నిమాపక కేంద్రాలు ప్రారంభం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)